Economic Survey 2024 | ఇండియన్ గ్రాడ్యుయేట్లలో సగం మందికి ఉద్యోగ నైపుణ్యాల్లేవ్ : ఆర్థిక సర్వే
Economic Survey 2024 | దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారే ఉన్నారని, వారిలో చాలామందికి ఆధునిక ఆర్థిక వ్యవస్థ (Modern Economy) కు అవసరమైన నైపుణ్యాలు లేవని ఆర్థిక సర్వే 2023-24 (Economic Survey-2023-24) స్పష్టం చేసింది.
Economic Survey 2024 : దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారే ఉన్నారని, వారిలో చాలామందికి ఆధునిక ఆర్థిక వ్యవస్థ (Modern Economy) కు అవసరమైన నైపుణ్యాలు లేవని ఆర్థిక సర్వే 2023-24 (Economic Survey-2023-24) స్పష్టం చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువతలో కేవలం 51.25 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయని, మిగిలిన వాళ్లలో ఆ నైపుణ్యాల కొరత కొట్టొచ్చినట్టు కనబడుతోందని ఈ ఆర్థిక సర్వే పేర్కొన్నది.
కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటికి వస్తున్న ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు ఉద్యోగాలు చేసేందుకు సిద్ధంగా ఉండటంలేదని ఆర్థిక సర్వే వెల్లడించింది. అయితే దశాబ్ధం క్రితంతో పోల్చితే ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడిందని సర్వే తెలిపింది. పదేళ్ల క్రితం ప్రతి 100 మంది గ్రాడ్యుయేట్లలో కేవలం 34 మందికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉండేవని, ఇప్పుడు ఆ శాతం 51.3కు చేరిందని ఆర్థిక సర్వే స్పష్టంచేసింది.
అదేవిధంగా దేశంలో నిరుద్యోగిత రేటు కూడా తగ్గుతూ వస్తున్నదని తాజా ఆర్థిక సర్వే తెలియజేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం కల్లా దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి పడిపోయిందని పేర్కొంది. అంతేగాక ఉద్యోగాల్లో యువత, మహిళల భాగస్వా్మ్యం పెరగిందని, దాంతో గడిచిన ఐదేళ్లలో ఈపీఎఫ్వోలో ఖాతాదారులు సంఖ్య రెట్టింపయ్యిందని ఆర్థిక సర్వే వెల్లడించింది.
Reae more
Cabinet Sub Committee | జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. సమాచారం ఇవ్వాలని మంత్రి ఆదేశం
Supreme Court | ఆ నిర్దేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ
Viral news | యువతి పుర్రెలో 77 సూదులు గుచ్చిన మంత్రగాడు.. చివరికి ఏమైందంటే..!
Viral news | జింకను చుట్టిపడేసిన కొండచిలువ.. ఆఖరి క్షణంలో ఏం జరిగిందంటే..Video
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

