Cabinet Sub Committee | జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. సమాచారం ఇవ్వాలని మంత్రి ఆదేశం
Cabinet Sub Committee | జీవో 317పై మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
Cabinet Sub Committee | జీవో 317పై మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సమావేశంలో తొమ్మిది ప్రభుత్వ శాఖలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు శాఖలపరంగా పూర్తి సమాచారం ఇవ్వనందున యుద్ధ ప్రాతిపదికన పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కమిటీ సమావేశంలో పలు అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడం జరిగిందని తెలిపారు. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్, ప్రమోషన్ అంశాలను పరిగణలోకి తీసుకొని 317 జీవోను పరిష్కరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.
సబ్ కమిటీ సమావేశంలో వివిధశాఖల ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, మహేశ్ కుమార్ ఎక్కా దత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, అడిషనల్ డీజీ షికా గోయల్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శరత్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ శృతి ఓజా, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని, సోషల్ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి, వైద్యారోగ్యశాఖ, జీఏడీ ఉన్నతాధికారులు వినయ్ కృష్ణారెడ్డి, బూసని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

