Supreme Court | ఆ నిర్దేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ
Supreme Court | కన్వరీ యాత్రా (Kanwari Yatra) మార్గంలోని స్టాల్స్, హోటళ్ల యజమానులు ఆయా స్టాల్స్, హోటల్స్ నేమ్ ప్లేట్స్పై తమ పేర్లును వేయించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీచేసిన నిర్దేశాలపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది.
Supreme Court : కన్వరీ యాత్రా (Kanwari Yatra) మార్గంలోని స్టాల్స్, హోటళ్ల యజమానులు ఆయా స్టాల్స్, హోటల్స్ నేమ్ ప్లేట్స్పై తమ పేర్లును వేయించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీచేసిన నిర్దేశాలపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది. దీనిపై సమాధానం చెప్పాలంటూ ఆ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.
కన్వరీ యాత్రా మార్గంలోని స్టాల్స్, హోటల్స్ యజమానులు ఆయా స్టాల్స్, హోటల్స్ నేమ్ ప్లేట్లపై తమ పేర్లను వేయించాలని ముందుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశాలు జారీచేసింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉత్తరప్రదేశ్ను అనుసరించాయి. దాంతో ఈ నిర్దేశాలను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇచ్చిన నిర్దేశాలపై కోర్టు స్టే విధించింది. అంతేగాక సమాధానం ఇవ్వాలంటూ ఆ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కేసు తుదపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఆహారపదార్థాలను అమ్ముకునే వ్యాపారులు నేమ్ ప్లేట్లపై పేర్లను వేయించాలని బలవంతపెట్టడం సబబు కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

