Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. సూచీలు సోమవారం లాభాల్లో మొదలయ్యాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,408.90 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే సూచీలు కొలుకున్నాయి. మళ్లీ కొంతసేపటికే మార్కెట్లు అస్థితరకు గురయ్యాయి. చివరి నష్టాల్లోనే కొనసాగాయి. ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 80,800.92 పాయింట్ల గరిష్ఠానికి చేరుకున్నది. 80,100.65 పాయింట్ల కనిష్ఠానికి పతనమైంది.
చివరకు 102.57 పాయింట్ల నష్టంతో 80,502.08 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 21.65 పాయింట్లు పతనమై 24,509.25 వద్ద ముగిసింది. దాదాపు 1953 షేర్లు పురోగమించాయి. 1575 షేర్లు పతనం కాగా.. 116 షేర్లు మారలేదు. నిఫ్టీలో విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నష్టపోయాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి. సెక్టోరల్ ఫ్రంట్‌లో, ఆటో, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, మెటల్, పవర్ సూచీలు ఒక్కొక్కటి ఒక శాతం పెరిగాయి. మీడియా, బ్యాంక్, ఐటీ, రియల్టీ, ఎఫ్ఎంసీజీలో అమ్మకాలు కనిపించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం వృద్ధిని నమోదు చేశాయి.