Maheshwar Reddy | మంత్రి పొంగులేటిపై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణలు..!
Maheshwar Reddy | దేశంలోనే భారీ అవినీతి మంత్రి.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. పొంగులేటికి సంబంధించిన రాఘవ కంపెనీలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
Maheshwar Reddy | దేశంలోనే భారీ అవినీతి మంత్రి.. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. పొంగులేటికి సంబంధించిన రాఘవ కంపెనీలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కుంభకోణంలో పొంగులేటి కంపెనీ భాగస్వామి అన్నారు. ఆ బ్యాంకు మన దేశానికి, చట్టసభలకు సంబంధం లేని ఫైనాన్స్ కంపెనీ అని అన్నారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు రూ.400కోట్లకు గ్యారెంటీలు ఇచ్చేవిధంగా.. ఆర్బీఐ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా ఉన్నాయన్నారు. మార్గదర్శకాలను ఉల్లంఘించి మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. సర్పంచులకు బిల్లు రావు కానీ.. మంత్రి పొంగులేటి వందల కోట్ల చెల్లిస్తున్నారని మండిపడ్డారు.
కుంభకోణంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ఇంకా కుంభకోణాలు చాలానే ఉన్నాయని.. అందులోని అందరి గుత్తేదారుల పేర్లు బయటపెడతానన్నారు. ఫేక్ డాక్యుమెంట్లతో రూ.వేలకోట్ల కాంటాక్టులు తీసుకుంటున్నారని.. ప్రభుత్వం, చట్టాలను మోసం చేస్తున్నారన్నారు. వీటిపై ఎంత పెద్దవారున్నా న్యాయ విచారణ చేయాల్సిందేనన్నారు. సీబీఐ విచారణ సైతం జరగాల్సిందేనన్నారు. భారత దేశ చట్టాలను అతిక్రమిస్తున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలన్నారు. ఎస్బీఐ ఏ అధికారంతో ఇచ్చింది.. ఇవ్వనట్లయితే ఫేక్‌వి సృష్టించారా? అనే దానిపై విచారణ జరగాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మహిళలు, విద్యార్థులు, రైతులతో పాటు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

