సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 17:17:50

అత్తాపూర్‌లో ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌

అత్తాపూర్‌లో ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ 61వ డివిజన్‌ అత్తాపూర్‌లో టీఆర్‌ఎస్‌ విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి రౌండ్‌ ముగిసే వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెరువుకు మాధవి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై వెయ్యికిపైగా ఓట్ల ఆధిక్యం ప్రదర్శించారు. మాధవికి 6,859 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ఎం సంగీతకు 5578 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఏ మాధవికి 118, కాంగ్రెస్‌ అభ్యర్థి వాసవికి 404, స్వతంత్ర అభ్యర్థులు ఉమామహేశ్వరికి 12, నుస్రత్‌ జహాన్‌కు 48, వీవీ శాంతికుమారికి 15, శిల్పకు 63, సుగంధ్‌కౌర్‌కు 189 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్‌లో 14వేల ఓట్లకు 13,999 ఓట్లు చెల్లుబాటు కాగా, 661 ఓట్లు తిరస్కరణకు గురవగా.. 52 నోటాకు పోలయ్యాయి. 


ఇది కూడా చదవండి : రాజేంద్రనగర్‌లో టీఆర్‌ఎస్‌ Vs బీజేపీ


logo