కేసీఆర్‌కు ఘనస్వాగతం
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రానికి గురువారం వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు స్థానిక పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వందలాది మంది తమ అభిమాన నాయకుడి కోసం గంటల కొద్దీ ఎదురు చూసి బస్సు రాగానే పూల వర్షం కురిపించారు.
- బస్సులో దేవరుప్పుల మీదుగా భువనగిరి రోడ్ షోకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత
- అభిమాన నాయకుడి కోసం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
- బస్సుపై పూలవర్షం కురిపించిన నాయకులు, కార్యకర్తలు
- మాజీ మంత్రి ఎర్రబెల్లిని బస్సెక్కమని సైగ చేసిన కేసీఆర్
దేవరుప్పుల, ఏప్రిల్ 25: జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రానికి గురువారం వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు స్థానిక పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వందలాది మంది తమ అభిమాన నాయకుడి కోసం గంటల కొద్దీ ఎదురు చూసి బస్సు రాగానే పూల వర్షం కురిపించారు. యాదాద్రి భువనగిరిలో రోడ్‌షోకు దేవరుప్పుల మీదుగా బస్సులో కేసీఆర్ వెళ్తున్నారనే సమాచారంతో మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు వందలాది నాయకులు, కార్యకర్తలు చేరుకొని కేసీఆర్‌కు భారీ స్వాగతం పలికారు.

బస్సుకు అడ్డుపడి కేసీఆర్‌ను చూసేందుకు ఎగబడ్డారు. మహిళా కార్యకర్తలు ఆయనపై పూల వర్షం కురిపించారు. బసు అద్దం వద్దకు పోయి చేయి ఊపుతూ అభివాదం చేశారు. దీంతో కేసీఆర్ అద్దానికి చేయి ఆనించి కరచాలనం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లిని గమనించిన కేసీఆర్ నవ్వుతూ బస్సెక్కాలని సైగ చేశారు. దీంతో బస్సెక్కిన ఎర్రబెల్లి కేసీఆర్ పక్కన కూర్చుని ప్రజలకు అభివాదం చేశారు. గంట వ్యవధిలో ఇంత మంది రావడంపై ఎర్రబెల్లిని కేసీఆర్ అభినందించినట్లు తెలిసింది. 10 నిమిషాల పాటు ఆగిన కేసీఆర్ బస్సు కదలడంతో రోడ్డు క్లియర్ అయింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

