రోడ్‌షోను విజయవంతం చేయాలి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రోడ్‌ను విజయవంతం చేయాలని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి సూచించారు. ఈమేరకు గురువారం ఆయన నాగర్‌కర్నూల్ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.
- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 25: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రోడ్‌ను విజయవంతం చేయాలని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి సూచించారు. ఈమేరకు గురువారం ఆయన నాగర్‌కర్నూల్ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈనెల 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగే కేసీఆర్ రోడ్‌షో నిర్వహిస్తున్నారన్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాగర్‌కర్నూల్‌లోని తన నివాసంలో చర్చించారు.
తొలి తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి ప్రతి ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. పల్లెల్లో పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలే అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్‌షో నిర్వహిస్తున్నారని, మన పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తున్న అధినేతకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రవీణ్‌కుమార్‌కు నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి మెజార్టీ ఓట్లు వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. రోడ్‌షోకు పట్టణంలోని నాయకులు, కార్యకర్తలకు కార్యక్రమం విజయవంతం చేసేందుకు దిశానిర్ధేశం చేశారు. నాగర్‌కర్నూల్ పట్టణం నుండి పెద్ద ఎత్తున పట్టణ వాసులు పాల్గొనే విధంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

