అమీన్పూర్, ఏప్రిల్ 25: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ వైస్‌చైర్మన్ నందారం నరసింహగౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మెదక్ లోక్‌సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గురువారం సమావేశమయ్యారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి ప్రణాళికాబద్ధంగా పనిచేసి రికార్డు మెజార్టీ అందించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. పనిమంతుడు, పరిపాలన దక్షత కలిగిన వెంకట్రామిరెడ్డిలాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే మెదక్ పార్లమెంట్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.