మహబూబాబాద్ రూరల్/దంతాలపల్లి, ఏప్రిల్ 25 : బీఆర్ఎస్తోనే పేదలకు న్యాయం జరుగు తుందని మహబూబా బాద్ లోక్‌సభ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో వాకర్స్‌తో కలిసి మార్నింగ్ వాకింగ్ చేసి కూరగాయల సెంటర్, పలు కాలనీ ల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి జరిగిందని అన్నారు. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందన్నారు. పేదల సమస్యలు తీరాలంటే బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ పాల్వా యి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మా ర్నేని వెంకన్న పాల్గొన్నారు.
దంతాలపల్లి మండలంలోని కుమ్మరికుంట్ల, నిదానపురం, ఆగపేట, తూర్పుతండా, దంతాలపల్లిలో ఉపాధి హామీ కూలీలతో కవిత మమేకమైంది. కుమ్మరికుంట్లలో కూలీలతో కలిసి పని చేసింది. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వేణు, నాయకులు వొలాద్రి మల్లా రెడ్డి, నూకల గౌతమ్‌రెడ్డి, ము త్యం వెంకన్న, వీరబోయి న కిశోర్‌కుమార్, దుబ్బాకుల వెంకన్న, చిల్లా రామకృష్ణ, తండా రాములు, అవిలయ్య, నరేశ్, శ్రీను, వెంకన్న, అనంతరాములు పాల్గొన్నారు.