CM KCR | పేదలకు గృహ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ.. ఇది కొనసాగుతూనే ఉంటుంది : సీఎం కేసీఆర్
CM KCR | పేదలకు గృహ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని.. దీన్ని కొనసాగిస్తూనే ఉంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు.
CM KCR | పేదలకు గృహ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని.. దీన్ని కొనసాగిస్తూనే ఉంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎంతో వ్యయంతో, అన్ని వసతులతో అందంగా నిర్మించిన ఈ ఇండ్లను పేదలకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇచ్చే పథకం మరెక్కడా లేదని అన్నారు. దేశంలో ఎక్కడా పేదల కోసం ఇటువంటి ఇండ్ల నిర్మాణం జరగడం లేదన్నారు. కొల్లూరులో 124 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల సముదాయం ఓ టౌన్ షిప్ ను తలపించేదిగా ఉందని చెప్పారు. ఇక్కడ 117 బ్లాకుల్లో 15,660 ప్లాట్లు నిర్మించామని.. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని తెలిపారు. పేదలకు గృహ నిర్మాణం అనేది ఓ నిరంతర ప్రక్రియ అని దీన్ని కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. పేదలు ఎవరైనా తమ సొంత జాగాలో ఇళ్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మీ పథకం కింద పథకం రూ.3లక్షలు అందిస్తుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ 3వేల మందికి గృహలక్ష్మీ పథకం ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి
Read More :
“CM KCR | ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచే దోపిడీకి గురైన తెలంగాణ: సీఎం కేసీఆర్”
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

