Cm KCR | నా ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నా.. ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : సీఎం కేసీఆర్
Cm KCR | మిషన్ భగీరథ (Mission Bhagiratha) ద్వారా నూటికి నూరు శాతం గృహాలకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
Cm KCR | మిషన్ భగీరథ (Mission Bhagiratha) ద్వారా నూటికి నూరు శాతం గృహాలకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా (Telangana Decade celebrations) హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ (Cm KCR) జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధిచేసిన నీరు ఇవ్వలేకపోతే.. బిందెడు నీళ్ల కోసం మహిళలు పడే కడగండ్లను నివారించకుంటే, తాను ప్రజలను ఓట్లు అడగనని రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. తాను చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నట్లు చెప్పారు. ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు.
‘దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ అట్టడుగు స్థానంలో ఉండగా.. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడోస్థానంలో ఉంది. మనం ప్రారంభించిన మిషన్ భగీరథను అనుకరిస్తూ కేంద్రప్రభుత్వం ‘హర్ ఘర్ జల్ యోజన’ అనే పథకాన్ని అమలుచేస్తోంది. కానీ, అదింకా నూటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకోలేదు’ అని సీఎం అన్నారు.
కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ భగీరథ నీటిని పరీక్షలు నిర్వహించి రూపొందించిన వాటర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం.. ఒక్క తెలంగాణలోనే 99.95 శాతం నల్లానీళ్లలో కలుషిత కారకాలు లేవని నిర్థారించిందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. నేషనల్ వాటర్ మిషన్ అవార్డు, జల్ జీవన్ అవార్డులతో సహా, పలు అవార్డులు, ప్రశంసలు మిషన్ భగీరథకు లభించాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘మిషన్ భగీరథ పథకంతో నేడు తాగునీటి కోసం ప్రజలు మండుటెండలో బిందెలు నెత్తిన పెట్టుకొని మైళ్ళకుమైళ్ళ దూరం నడిచే దృశ్యాలు లేవు. ఖాళీ బిందెలతో ప్రజల ధర్నాలు లేవు. ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల ఫ్లోరోసిస్ బారినపడి ప్రజలు వికలాంగులుగా మారిన దృశ్యాలు మచ్చుకు కూడా నేడు కానరావు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా ఫ్లోరైడ్ బాధలు లేవన్నది కేంద్రంతో సహా అందరూ అంగీకరించిన వాస్తవం’ అని సీఎం వివరించారు.
Also Read..
CM KCR | సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిన తెలంగాణ: సీఎం కేసీఆర్
Minister KTR: పోరాట యోధుడే పాలకుడై.. మంత్రి కేటీఆర్ ట్వీట్
CM KCR | ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచే దోపిడీకి గురైన తెలంగాణ: సీఎం కేసీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

