Isro | సైంటిస్ట్/ఇంజినీరింగ్ ‘ఎస్సీ’ 92 పోస్టుల భర్తీకి ఇస్రో సెంట్రలైడ్జ్ రిక్రూట్మెంట్ బోర్డు (ICRB) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్ స్కోర్‌తో భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17లోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు, ఖాళీలు
సైంటిస్ట్/ఇంజినీరింగ్ ‘ఎస్సీ’ (ఎలక్ట్రానిక్స్) 34, సైంటిస్ట్/ఇంజినీరింగ్ ‘ఎస్సీ’ (మెకానికల్) 26, సైంటిస్ట్/ఇంజినీరింగ్ ‘ఎస్సీ’ (కంప్యూటర్ సైన్స్) 13, సైంటిస్ట్/ఇంజినీరింగ్ ‘ఎస్సీ’ (సివిల్) 10, సైంటిస్ట్/ఇంజినీరింగ్ ‘ఎస్సీ’ (ఎలక్ట్రికల్) 4, సైంటిస్ట్/ఇంజినీరింగ్ ‘ఎస్సీ’ (రిఫ్రిజిరేషన్ అండ్ కండిషనింగ్) 2, సైంటిస్ట్/ఇంజినీరింగ్ ‘ఎస్సీ’ (ఆర్కిటెక్చర్) 2, సైంటిస్ట్/ఇంజినీరింగ్ ‘ఎస్సీ’ (సివిల్-పీఆర్ఎల్) 1 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు
పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. వయస్సు 28 ఏండ్లు మించరాదు.
ఎంపిక
గేట్ స్కోర్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 56,100+ఇతర అలవెన్సులు ఇస్తారు.
దరఖాస్తు ఫీజు రూ. 250, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. ఆన్లైన్లో చేసుకునే దరఖాస్తులకు ఆగస్టు 17 చివరితేదీ. ఇతర వివరాలకు వెబ్సైట్ www.isro.gov.inలో చూడవచ్చు.