హైదరాబాద్ : బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇయ్యాల్సిన పీఆర్సీ గానీ, డీలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్కుసంబంధించిన ఒక్క రూపాయి కూడా పెండింగ్ పెట్టలేదని హరీష్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంమాత్రం ఉద్యోగులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామిని కూడా నెరవేర్చలేదని హరీష్ అన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు రిటైర్మెంట్ బినిఫిట్స్ అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య బాగాలేక ఎంతో మంది చనిపోయారని మాజీ మంత్రి గుర్తు చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించమని కోర్టుకు వెళ్లినా ఈ సర్కరారు వారిపట్ల కనికరం చూపించలేదన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి రథ చక్రాల్లాంటివారు, వారు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగే అవకాశముంటుందని హరీష్ అన్నారు. కానీ.. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్లకు రావలిసిన బెనిఫిట్స్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు.
ఇవాళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు దేశంలో ఎక్కడాలేని విధంగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా ఉద్యోగుకలకు పీఆర్సీ ఇవ్వలేదు. గతంలో కేసీఆర్ హయాంలో ఒకసారి 39, మరోసారి 43 శాతం పీఆర్సీ ఇచ్చిన విషయాన్ని హరీష్‌రావు అసెంబ్లీ వేధికగా గుర్తుచేశారు. అదేవిధంగా ఉద్యోగులకు ఈహెచ్ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్)ను కూడా అమలు చేయాలని, ఉద్యోగులకు జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన అన్నారు. అంతేకాక, ఇవాళ రిటైరయిన ఉద్యోగులు తమకు రావలిసిన బెనిఫిట్స్ అందక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, డబ్బులు లేక సరైన వైద్యం అందక దాదాపు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.
బీఆర్ఎస్ హయాంలో సుమారు 15వేల మంది ఉద్యోగులు రిటైరైతే వారందరికీ అందాల్సిన బెనిఫిట్స్ ఒక్క రూపాయి కూడా పెండింగ్ పెట్టకుండా ఇచ్చామని హరీష్ తెలిపారు. అదేవిధంగా సీపీఎస్ పెన్సన్ స్కీమ్‌ను ఓపీఎస్‌గా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామి ఇచ్చిందని, అది ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని, ఎప్పటిలోగా ఓల్డ్‌పెన్షన్ స్కీమును అమలు చేస్తారో చెప్పాలని హరీష్ అడిగారు. గత రెండేళ్లుగా సీపీఎస్ కింద రాష్ట్రప్రభుత్వం కట్టాల్సిన కాంట్రీబ్యూషన్ డబ్బులు కూడా కట్టకుండా వాటిని దారి మళ్లిస్తున్నారని, సీపీఎస్ కట్టకుండా, ఓపీఎస్ అమలు చేయకపోవడంతో రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, దయచేసి సీపీఎస్ కాంట్రిబ్యూషన్ కట్టమని, ఓపీఎస్‌ను త్వరగా అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హరీష్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | డబ్బుల కోసం జీహెచ్ఎంసీని అడ్డగోలుగా విభజించారు: కేటీఆర్
Telangana Assembly: అసెంబ్లీలో కేసీఆర్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో
KTR | ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా.. కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసిన కేటీఆర్
KTR | నన్ను అంటే పడతా.. కానీ మా నాన్నను అంటే ఊరుకునేది లేదు.. కేటీఆర్ వార్నింగ్