KTR | కాలంతో పోటీపడి మరీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరంలో రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికి నష్టమని అన్నారు. రాజకీయంగా తమకేమీ నష్టం రాదని స్పష్టం చేశారు. నీళ్లు తీసుకొచ్చింది ఎవరో ప్రజలకు తెలుసనని అన్నారు. 45 టీఎంసీలకు ఒప్పుకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నష్టం చేసినట్లే అని స్పష్టం చేశారు. 299 టీఎంసీలకు ఒప్పుకుంంది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దానిపైనే తమ ప్రభుత్వం మరిన్ని కేటాయింపు అడిగిందని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి కావాలనే పండబెట్టించడని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు కడితే కేసీఆర్‌కు పేరు వస్తుంది.. అప్పుడు ఆయన బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందని అన్నారు. కృష్ణా నది నుంచి నీళ్లు తీసుకుంటే బాబుకు కోపం వస్తుందని అన్నారు. అందుకే ప్రాజెక్టును పండబెటబ్టి.. కాల్వలు కూడా తవ్వడం లేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి అవినీతి అక్రమాలను ఆపినందుకే బూతులు మాట్లాడుతున్నాడని కేటీఆర్ తెలిపారు. నన్ను అంటే రెస్పాండ్ కాను.. కానీ మా నాన్నను అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి బూతులకు నేను రెస్పాండ్ అవుతుంటే.. అతనిలా దిగజారవద్దని చెబుతున్నారని పేర్కొన్నారు. నీళ్లు గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రెస్‌మీట్‌కే అల్లాడిపోతున్నారని.. అలాంటిది కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మని డిమాండ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నీళ్ల సబ్జెక్టు చదివితే రాదని.. రాష్ట్రంపై ప్రేమ ఉంటే వస్తుందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గొప్ప ఫలితాలు వచ్చాయని తెలిపారు.
కృష్ణానది ఏ బేసిన్, ఎక్కడ ఉన్నదని ముఖ్యమంత్రి అడిగాడని కేటీఆర్ తెలిపారు. భాక్రనంగల్ ఏ రాష్ట్రంలో ఉన్నదో కూడా ఈ ముఖ్యమంత్రికి తెల్వదని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తి ఇవాళ నీటిపారుదల శాఖ సలహాదారుడిగా ఉన్నాడని మండిపడ్డారు. వీళ్లు ఇప్పుడు అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై చర్చ అంటున్నారని అన్నారు. నీటిపారుదల శాఖపై కనీస అవగాహన లేని వ్యక్తులు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారని తెలిపారు. కేసీఆర్ వస్తున్నాడని ఇప్పుడు చర్చకు ప్రిపేర్ అవుతున్నారని విమర్శించారు.
మేడిగడ్డను ఎవరో బాంబులు పెట్టి పేల్చారని పాడి కౌశిక్ రెడ్డి సభలో స్పష్టంగా చెప్పాడని కేటీఆర్ అన్నారు. బూతులు మాట్లాడాలంటే ఎన్నిరోజులైనా చర్చ పెడతారని.. సబ్జెక్ట్ లేనప్పుడు సభను ఎక్కువ రోజులు నడపలేరని తెలిపారు. చెక్‌డ్యాం పేల్చివేతలో రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నదని అన్నారు. ఆనాడు మేడిగడ్డ పేల్చారని ఇంజినీర్లు ఫిర్యాదు చేస్తే ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. రష్యా ఉద్యమంలో కాకువ డ్యామ్‌ను పేల్చేశారని.. అలాగే తెలంగాణలో మేడిగడ్డను పేల్చారని గతంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లుప్తంగా వివరించి చెప్పారని అన్నారు. ఈ ప్రభుత్వం సభ సమయం పాటించడం లేదని కేటీఆర్ తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా సభలో ఇవాళ మొదటి రోజే జీరో అవర్ పెట్టారని అన్నారు.