హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) శీతాకాల సమావేశాల్లో ఆసక్తికర సంఘటన జరిగింది. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇవాళ సభకు హాజరయ్యారు. అయితే చైర్లో కూర్చుకున్న కేసీఆర్‌ను.. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కలిశారు. నమస్కారం చేస్తూ తన దగ్గరకు వస్తున్న సీఎం రేవంత్‌ను చూసి కేసీఆర్ లేచి నిలబడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కేసీఆర్ ఆరోగ్యం, యోగక్షేమాల గురించి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కేసీఆర్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ విష్ చేశారు.