ఖమ్మం : ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన కొణిజర్ల మండలం పల్లిపాడులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వైరా మండలం వల్లపురానికి చెందిన సెల్వరాజు బైక్‌పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సెల్వరాజు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు