ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 01:03:49

చేతనైతే ఆరోపణలు నిరూపించు!

చేతనైతే ఆరోపణలు నిరూపించు!

  • ఎంపీ అర్వింద్‌కు మంత్రి వేముల సవాల్

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వ నిధులను తాను కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులకు మళ్లించానని చెప్తున్న నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌కుమార్‌ ఆరోపణలను నిరూపించాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. సాధారణంగా అర్వింద్‌ ఆరోపణలు, విమర్శలకు స్పందించి సమయాన్ని వృథా చేసుకోవడం మంచిదికాదని అన్నారు. కానీ ఒక్క అంశంపై తాను వాస్తవాన్ని చెప్పాలని భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ‘కేంద్రం రోడ్ల కోసం ఇచ్చిన ప్రతిపైసా రోడ్ల కోసమే ఖర్చుచేశాం. చిల్లిగవ్వ కూడాఎక్కడికి మళ్లించలేదు. ఒక్క రూపాయి కూడా ఎవరూ దోచుకోలేదు. మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా.. చేతనైతే నీ ఆరోపణలను రుజువు చేయి’ అని సవాల్‌చేశారు


logo