MLA Jagadish Reddy | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు నేను మీ తుపాకి గుండ్లకు బలైన అమరవీరుల కొరకు తిరుగుతున్నా.. కానీ రేవంత్ రెడ్డి సంచులు మోసి జైలుకు పోయినప్పుడు నేను ఇక్కడే ఈ సభలో ఉన్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో విద్యుత్ పద్దులపై చర్చ సందర్భంగా వాడీవేడి చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. వాస్తవానికి విద్యుత్ పద్దులపై డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిన సమాధానం సీఎం రేవంత్ ఇచ్చారు. సీఎం 20 నిమిషాలు మాట్లాడారు. నన్ను ఒక్క నిమిషంలో పూర్తి చేయాలంటే ఎలా..? డెమోక్రటిక్గా ఎంత సేపైనా మాట్లాడొచ్చు అంటున్నారు. తమరు దయచేసి అవకాశం ఇవ్వండి.. 10 నిమిషాలు ఇస్తే కంప్లీట్ చేయగలుగుతా 20 నిమిషాలు ఆరోపణలు చేస్తే 10 నిమిషాలైనా సమాధానం చెప్పాలి కదా..? అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
విద్యుత్ పద్దుల సందర్భంగా సీఎం చాలా విషయాలు ప్రస్తావించారు. కమిషన్, కోర్టు విషయం ప్రస్తావించింది వారే.. వారు మాట్లాడితే తప్పు లేదు కానీ.. మేం మాట్లాడితే తప్పు అంటున్నారు. కిషన్ రెడ్డి పేరు నేను ప్రస్తావించలేదు.. రాగోపాల్ రెడ్డి ప్రస్తావించారు. ఒక్క అక్షరం కూడా తప్పు మాట్లాడలేదు.. వారే సభను తప్పుదోవ పట్టించారు. వారు మాట్లాడిన దాని మీదనే మాట్లాడాను. నేను ఈ సభలో మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కడున్నారు అని రేవంత్ అడిగారు. నిజమే.. మీరు సభలో మాట్లాడుతున్నప్పుడు మీ తుపాకీ గుండ్లకు బలైన అమరవీరుల కొరకు తిరుగుతూ అక్కడున్నా.. మీరు సంచులు మోసి జైలుకు పోయినప్పుడు నేను ఇక్కడే ఉన్నానన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు నేను మీ తుపాకి గుండ్లకు బలైన అమరవీరుల కొరకు తిరుగుతున్నా
కానీ రేవంత్ రెడ్డి సంచులు మోసి జైలుకు పోయినప్పుడు నేను ఇక్కడే సభలో ఉన్న – బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి pic.twitter.com/LObj0dKEb8
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2024
ఇవి కూడా చదవండి..
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. 4 గంటలకు గేట్లు ఓపెన్
KTR | కాంగ్రెస్ కర్కశ పాలనకు సాక్ష్యమిది..! ముదిగొండ మారణహోమానికీ 17 ఏళ్లు..!! కేటీఆర్ ట్వీట్