MLA Jagadish Reddy | కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే.. రేవంత్‌లా సంచులు మోసే చంద్రుడు కాదు : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
MLA Jagadish Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముమ్మాటికీ సత్యహరిశ్చంద్రుడే అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. రేవంత్‌లా సంచులు మోసే చంద్రుడు కాదు అని ఆయన పేర్కొన్నారు.
MLA Jagadish Reddy | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముమ్మాటికీ సత్యహరిశ్చంద్రుడే అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. రేవంత్‌లా సంచులు మోసే చంద్రుడు కాదు అని ఆయన పేర్కొన్నారు. శాసనసభలో విద్యుత్ పద్దులపై చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సత్యహరిశ్చంద్రులు అయితే ఎందుకు విద్యుత్ జ్యుడిషియల్ కమిషన్‌కు అడ్డు వస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దొంగతనం దొరికిపోయింది కాబట్టే రేవంత్ రెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని జగదీశ్ రెడ్డి నిలదీశారు. మా అధినేత కేసీఆర్ హరిశ్చంద్రుడే. రేవంత్ రెడ్డిలా సంచులు మోసే చంద్రుడు కాదు.. చంద్రుడికి సంచులు మోసి జైలుకు పోయింది రేవంత్ రెడ్డినే అని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.
నేను విద్యుత్ విషయంలో నిజనిజాలు మాట్లాడుతుంటే.. రేవంత్ రెడ్డినే వడివడిగా సభలోకి వచ్చి నాకు అడ్డు తగిలారు. సీఎం సభలో అడుగు పెట్టగానే తప్పుదోవ పట్టింది. కేసీఆర్ కాలు గోటికి మీరు సరిపోతారా..? కేసీఆర్ గురించి మాట్లాడింది రికార్డుల నుంచి తొలగించండి.. సభను హుందాగా నడిపించాలి. సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు అని జగదీశ్ రెడ్డి అధికారపక్షాన్ని నిలదీశారు.
ఇవి కూడా చదవండి..
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. 4 గంటలకు గేట్లు ఓపెన్
KTR | కాంగ్రెస్ కర్కశ పాలనకు సాక్ష్యమిది..! ముదిగొండ మారణహోమానికీ 17 ఏళ్లు..!! కేటీఆర్ ట్వీట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

