MLA Jagadish Reddy | హైదరాబాద్ : శాసనసభలో విద్యుత్ పద్దులపై చర్చ సందర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. జగదీశ్ రెడ్డి హత్య కేసుల్లో నిందితుడు అని రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి సీఎం, మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. తాను హత్య కేసుల్లో నిందితుడినని నిరూపిస్తే ఇదే సభలో ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి ఎందుకు జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో.. మళ్లీ అక్కడికే వెళ్లాలని అనుకుంటున్నాడు. నాకు కూడా చంచల్‌గూడ జైలు జీవితం గుర్తుంది. తెలంగాణ ఉద్యమం కోసం జైలుకు పోయాం. ఆయనకు చర్లపల్లినే గుర్తు ఉంటది మళ్లీ యాది చేసుకంటున్నాడు. సీఎం రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనపై ఆరోపణల చేసిన ప్రతి అక్షరం రికార్డుల నుంచి తొలగించాలి అని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
నేను చాలెంజ్ వేస్తున్నా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక్కటి నిరూపించినా.. అందులో ఒక్కటి రికార్డు చూయించినా నేను ఈ సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి పోతా.. రాజకీయాల్లో నుంచి వెళ్లిపోతా..! తప్పని నిరూపించకపోతే కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలి.. పదవులకు రాజీనామా చేయాలి. తాను తన చాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నానని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
నేను ఎక్కడా తప్పు మాట్లాడలేదు. ఉపేక్షించం అని శాసనసభ వ్యవహారాల మంత్రి భయపెట్టిస్తున్నారు. ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టారు తనపై అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మూడింటింలో కోర్టు నిర్దోషిగా తేల్చింది. తెలంగాణ ఉద్యమం కేసులు తప్ప.. వేరే కేసులు లేనే లేవు. పెట్రోల్ బంక్ దొంగతనం కేసు, మిర్యాలగూడ కేసు మీద హౌస్ కమిటీ వేయండి.. ఒక్క కేసు నా మీద ఉన్న ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తాను. నిరూపించకపోతే సీఎం, మంత్రి కూడా ముక్కునేలకు రాసి రాజీనామా చేయాలి అని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. 4 గంటలకు గేట్లు ఓపెన్
KTR | కాంగ్రెస్ కర్కశ పాలనకు సాక్ష్యమిది..! ముదిగొండ మారణహోమానికీ 17 ఏళ్లు..!! కేటీఆర్ ట్వీట్