KTR | హైదరాబాద్ : ముదిగొండ మారణహోమం కాంగ్రెస్ కర్కశ పాలనకు సాక్ష్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మారణహోమానికి నేటితో 17 ఏండ్లు పూర్తయ్యాయని ట్వీట్ చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో రైతులను, కమ్యూనిస్టులను పిట్టల లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపింది అని గుర్తు చేశారు.
జానెడు జాగా కోసం ఆనాడు ఖమ్మం జిల్లా ముదిగొండలో శాంతియుతంగా రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్న నిరుపేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరిపింది. అప్పటి రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో విచక్షణారహితంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
2007, జులై 28న పేద ప్రజలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముదిగొండ కేంద్రంగా ధర్నా నిర్వహించారు. ప్రశాంతంగా కొనసాగుతున్న ధర్నాలో ఒక్కసారిగా రాబందుల అలజడి మొదలైంది. మొదట లాఠీఛార్జ్ తర్వాత ఒక్కసారిగా ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఉన్నట్టుండి ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ పోలీసులు కాల్పులు జరిపారు. జనాలంతా భయంతో పరుగులు తీశారు. పోలీసుల తూటాలకు ఏడుగురు బలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు వికలాంగులుగా మారారు. ఇక మృతదేహాలను ఖమ్మం కలెక్టరేట్ ముందు ఉంచి అనేక గంటల పాటు ఆందోళన నిర్వహించారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో వామపక్షాల ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు.
ముదిగొండ మారణహోమానికీ 17 ఏళ్లు !
కాంగ్రెస్ పార్టీ చేసిన మరో మారణహోమాం ముదిగొండ కాల్పులు !
నాడు(2007) ఖమ్మం జిల్లా ముదిగొండలో, రైతులని మరియు కమ్యూనిస్టులను పిట్టల లెక్క కాల్చి చంపిన కాంగ్రెస్ ప్రభుత్వం..
Never Forget pic.twitter.com/CYruID417F
— KTR (@KTRBRS) July 29, 2024
ఇవి కూడా చదవండి..
Runa Mafi | రుణమాఫీ గందరగోళం.. అర్హత ఉన్నా మాఫీకి నోచుకోని రైతన్న
Rain Update | మరో రెండు రోజులు వాన.. హైదరాబాద్కు రెడ్అలర్ట్