దుబ్బాక, మార్చి 19: కాంగ్రెస్ ప్ర భుత్వం కాళేశ్వరం కాలువల నిర్వహణను గాలికి వదిలేసింది. దీంతో కాలువల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి నీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. నీటిపారుదల అధికారులు హడావిడిగా నీళ్లు విడుదల చేస్తుండటంతో కాలువలకు గండ్లు పడి నీరంతా వృథాగా పోతున్నది. గురువా రం ఉదయం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ శివారులో మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు గండిపడింది.
మల్ల న్నసాగర్ ప్రాజెక్టు నుంచి తొగుట, తో ర్నాల, అప్పనపల్లి, హసన్‌మీరాపూర్, చెల్లాపూర్, రాజక్కపేట గ్రామాల మీ దుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబా ద్ మండలం చిప్పలపల్లి వరకు సు మారు 50కిలోమీటర్ల మేరకు ఈ ప్రధాన కాలువను నిర్మించారు. ఈ కాలువ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఇటీవల యాసంగి సాగుకు మల్లన్నసాగర్ నుంచి ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేశారు. కాలువలో నీటి ఉధృ తి ఒక్కసారిగా పెగిరి గండి పడిందని రైతులు తెలిపారు.
చెల్లాపూర్ సమీపం లో ప్రధాన కాలువకు గండిపడటంతో నీరంతా పొలాల నుంచి స్థానికంగా ఉ న్న కందూరు చెరువులోకి ప్రవహిస్తున్నది. దీంతో మిగిలిన గ్రామాల రైతు లకు సాగునీటి సరఫరాకు ఆటంకం ఏ ర్పడింది. పక్క గ్రామాలైన రాజక్కపే ట, ముస్తాబాద్ మండల రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు వద్ద ప్రధాన కాలువ గేట్లను మూసివేసి, సకాలంలో సమస్య పరిష్కరించాల్సి ఉన్నది. గండిపడిన విషయాన్ని అధికారులకు సమాచారం ఇ చ్చినా సత్వరం స్పందించలేదని రైతు లు ఆరోపించారు. 24 గంటల్లో పరిష్కరిస్తామని డీఈ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.