KTR | ప్రభుత్వ వెబ్సైట్లలో గత ప్రభుత్వ సమాచారాన్ని తొలగిస్తున్నారు.. సీఎస్ తక్షణమే జోక్యం చేసుకోవాలి: కేటీఆర్
ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో జరుగుతున్న డిజిటల్ విధ్వంసంపై తక్షణమే జోక్యం చేసుకుని వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కోరారు. కేసీఆర్ హయాంలోని ముఖ్యమైన సమాచారం, వివరాలను తొలగించారని తెలిపారు.
హైదరాబాద్: ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో జరుగుతున్న డిజిటల్ విధ్వంసంపై తక్షణమే జోక్యం చేసుకుని వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కోరారు. కేసీఆర్ హయాంలోని ముఖ్యమైన సమాచారం, వివరాలను తొలగించారని తెలిపారు. గత ప్రభుత్వ సమాచారం, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో భాగమని వాటిని కాపాడాలన్నారు. భవిష్యత్ తరాల కోసం ఈ డిజిటల్ సంపదను పరిరక్షించాలని, దానికోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయ పరంగా ముందుకు వెళ్తామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
‘సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కేసీఆర్ హయాంలోని ముఖ్యమైన సమాచారం, వివరాలు తొలగించబడ్డాయి. అది ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో అంతర్భాగం. ఈ డిజిటల్ ఆస్తులను రక్షించడానికి, భవిష్యత్ తరాలకు ఈ విషయాన్ని భద్రపరచడానికి మీ తక్షణ చర్య అసవరం. మీరు చర్య తీసుకోకుంటే, మేము న్యాయపరమైన పరిష్కారాన్ని కోరవల్సి వస్తుంది’ అంటూ సీఎస్ శాంతికుమారికి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Smt. Santhi Kumari Garu @TelanganaCS
This is a gentle reminder to kindly intervene and expedite action regarding the digital vandalism of Telangana government websites and social media handles
Important content from former CM Sri KCR’s tenure has been removed from these… https://t.co/NjQe6SjNWf
— KTR (@KTRBRS) July 29, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

