Midday meal Consume | మధ్యాహ్న భోజనం వికటించి 8 మంది విద్యార్థులకు అస్వస్థత
Midday meal Consume | నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద బాలుర ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు .
నాగిరెడ్డిపేట్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద బాలుర ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం ( Midday meal ) వికటించి 8 మంది విద్యార్థులు అస్వస్థతకు (ill) గురయ్యారు . వివరాల్లోకి వెళ్తే పాఠశాలలో ఒకటి నుంచి ఐదోతరగతి వరకు 54 మంది విద్యార్థులు( Students) చదువుతున్నారు.
మంగళవారం పాఠశాలకు 48 మంది విద్యార్థులు హాజరు కాగా మధ్యాహ్న భోజనంలో తోటకూర, పెసరి పప్పు చేసి వడ్డించడంతో భోజనం తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురై కడుపు నొప్పి,ఛాతి నొప్పితో బాధపడుతూ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ తులసికి వివరించారు. వెంటనే స్థానికులు 108 కు సమాచారం అందించడంతో అంబులెన్సు సహాయంతో విద్యార్థులను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి ( RDO Partha Simha Reddy) ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి తల్లిదండ్రులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం నమూనాలను ప్రయోగశాలకు పంపి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలపడంతో వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

