కేసీఆర్ శ్రమ.. ఆయిల్‌పామ్ పరిశ్రమ
బీఆర్ఎస్ సర్కార్ చొరవ, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమ ఫలితంగానే రూ.300 కోట్లతో నర్మెటలో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటైందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.
- కాళేశ్వర జలాలతోనే పంట సాగు, ఫ్యాక్టరీ సాధ్యం
- బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రూ.300 కోట్లతో నిర్మాణం
- 10కోట్ల లీటర్ల చెరువు కట్టుకున్నాం
- సాగుపై రైతుల్లో చైతన్యం తెచ్చాం
- సిద్దిపేట రైతుల పక్షాన కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నం
- సిద్దిపేట జిల్లా నర్మెట రైతుమేళా ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట, మార్చి 19( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ సర్కార్ చొరవ, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమ ఫలితంగానే రూ.300 కోట్లతో నర్మెటలో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటైందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వర జలాలు రావడం వల్లే ఆయిల్‌పామ్ సాగు పెరుగడంతో పాటు పరిశ్రమ సాధ్యమైందని, ఇందుకుగాను సిద్దిపేట జిల్లా రైతుల పక్షాన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు.
సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం నర్మెట గ్రామం లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ప్రారంభమైన రై తుమేళాకు హరీశ్‌రావు హాజరయ్యారు. ఫ్యాక్టరీ కోసం కేసీఆర్ సర్కార్ 2021లో నిర్ణయం తీసుకోగా నర్మెట రైతుల సహకారంతో టీజీఐఐసీ ద్వారా 62 ఎకరాల భూమి ని సేకరించామని తెలిపారు. గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంటేనే ఆయిల్‌పామ్ సాగవడ మే గాక దిగుబడి పెరుగుతుందని, అది కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్లే సాధ్యమైందని తెలిపారు.
అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను నిర్మించుకొని గోదావరి జలాలు ఎత్తిపోసిన ఫలితంగానే గాలిలో తేమ పెరిగి నాడు ఆయిల్‌పామ్ సాగు, నేడు పామాయిల్ పరిశ్రమకు బీజం పడిందని హరీశ్‌రావు వివరించారు. 2022 ఏప్రిల్ 4న ఫ్యాక్టరీకి భూమిపూజ చేసి వెంటనే టెండర్లు పిలిచామని, దిగుబడి వచ్చేలోగా ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చేలా శరవేగంగా పనులు చేశామని చెప్పారు.
మలేషియా టెక్నాలజీతో ఫ్యాక్టరీ
తెలుగు రాష్ట్రాల్లో ఎకడా లేనివిధంగా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థతో మలేషియా టెక్నాలజీతో నర్మెటలో ఫ్యాక్టరీని నిర్మించాలని ఆనాడే నిర్ణయం తీసుకున్నట్టు హరీశ్‌రావు గుర్తుచేశారు. ముందుగా క్రూడాయిల్ ఉత్పత్తిని ప్రారంభించాక, ఆ వెంటనే రిఫైనరీ ఆయి ల్ ఉత్పత్తి జరిగేలా ప్లాంట్‌ను ప్రారంభించాలని భావించినట్టు తెలిపారు.
ఫ్యాక్టరీకి నీటి కొరత లేకుండా రంగనాయకసాగర్ నుంచి ఎల్డీ 9 కాలువ ద్వారా 10కోట్ల లీటర్ల నీటిని నిలువ చేసేలా చెరువును నిర్మించినట్టు చెప్పారు. సాగుపై రైతుల్లో చైతన్యం కల్పించేందుకు బస్సుల్లో అశ్వారావుపేట, అప్పారావుపేటలో పంటలను, ఫ్యాక్టరీలకు తీసుకెళ్లినట్టు వి వరించారు. మొక్కల కోసం నర్సరీలు ఏర్పాటు చేసి ప్రత్యేక సబ్సిడీలతో రైతులను ప్రోత్సహించామని హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం దిగుబడి మొదలయ్యాక నూనెగింజల కొనుగోళ్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఇకడే అత్యాధునిక ఫ్యాక్టరీని నెలకొల్పామని చెప్పారు.
2021 జూన్ 5న నంగునూరు మండలానికి చెందిన మడుపు ఎల్లారెడ్డి భూమిలో తొలి ఆయిల్‌పామ్ మొకను తాను నాటిన విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని హరీశ్‌రావు తెలిపారు. సాగులో అకెనపల్లి రైతు ఉత్తమ అవార్డు అందుకున్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట జిల్లాలో 12వేల ఆయిల్‌పామ్ మొకలు నాటితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2వేల మొకలే నాటారని తెలిపారు. ప్రభుత్వం మారినా తుమ్మల నాగేశ్వరరావు ఇకడ ఫ్యాక్టరీ పనులను ముందుం డి నడిపించారని హరీశ్‌రావు ప్రశంసించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

