ఇందిరమ్మ బిల్లు ఎప్పుడిస్తరు.. ఆరు నెలలుగా ఎల్లవ్వ ఎదురుచూపులు
సొంతిల్లు లేని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను సర్కారు మంజూరు చేసినా.. సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కోట ఎల్లవ్వ రెండు బిల్లులు రాక ఆరు నెలల సంది ఎదురుచూస్తున్నది.
- ఆరు లక్షల దాకా అప్పు తెచ్చి నిర్మాణ పనులు
- ఇల్లు చివరి దశకు చేరినా బిల్లులు రాక తిప్పలు
గంభీరావుపేట, మార్చి 1 : సొంతిల్లు లేని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను సర్కారు మంజూరు చేసినా.. సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కోట ఎల్లవ్వ రెండు బిల్లులు రాక ఆరు నెలల సంది ఎదురుచూస్తున్నది. గతేడాది మేలో తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని కలెక్టర్ ప్రోసీడింగ్ అందించడంతో ఆమె సంబురపడ్డది. జూన్‌లో ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టింది. మొదటిసారి బేస్మిట్ పూర్తి చేసిన రెండు నెలల తర్వాత లక్ష రూపాయలు బిల్లు మంజూరైంది. తర్వాత కూడా బిల్లులు వస్తాయనే ఆశతో ఎల్లవ్వ ఆరు లక్షల వరకు అప్పులు తెచ్చింది.
ఆగస్టులోనే గోడలు పూర్తి చేసింది. అక్టోబర్‌లో స్లాబ్ వేయించింది. ప్లాస్టరింగ్ కూడా పూర్తి చేయించింది. అయితే ఆరు నెలలు గడిచినా మూడు లక్షల బిల్లులు రాక నిరాశతో ఎదురుచూస్తున్నది. ఎలాగైనా బిల్లులు వస్తాయనే నమ్మకంతోనే అప్పులు తెచ్చి పనులు పూర్తి చేయించానని ఎల్లవ్వ చెబుతున్నది. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని వాపోతున్నది. ఇంటి పనులు చివరి దశకు చేరాయని, త్వరగా బిల్లులు ఇప్పించాలని వేడుకుంటున్నది. ఈ విషయమై గంభీరావుపేట మండల హౌసింగ్ ఏఈ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల వద్ద పెండింగ్‌లో ఉందని, త్వరలోనే పరిష్కారమవుతుందని చెప్పారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

