Seetakka | హైదరాబాద్ : నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తన మంత్రి వర్గం నిరుద్యోగులపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. మీరు ఎంత గగ్గోలు పెట్టినా పరీక్షలు వాయిదా వేయబోమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. షెడ్యుల్ ప్రకారమే అన్ని పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది ఆమె పేర్కొన్నారు.
వాయిదా వేస్తే న్యాయ పరమైన, సాంకేతిక పరమైన చిక్కులు ఎదుర్కొక తప్పదన్నారు మంత్రి సీతక్క. వయో పరిమితి దాటిపోయి ఉద్యోగాలకు అర్హులు కాకుండా పోతారు. అందుకే వారి ఆకాంక్షల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని కొంత మంది నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్టిలో పరీక్షలను నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొందని ఆమె పేర్కొన్నారు.
అధికారం కోల్పోయి రాజకీయ నిరుద్యోగులుగా మారిన కొందరు, పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొట్టడం మానుకోవాలి. ఇప్పడు మధ్యలో పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం న్యాయం అనిపించుకోదు. పరీక్షలు వాయిదా పడుతాయని భ్రమలు కల్పించి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లొద్దని సీతక్క అన్నారు.
ఇవి కూడా చదవండి..
Heavy Rain | తెలంగాణలో ఐదురోజులు అతిభారీ వర్షాలు..! ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..
BRS Party | కాగజ్నగర్ ఉక్కు మహిళలకు పాదాభివందనాలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Harish Rao | చేసిన పనులే చరిత్రలో నిలిపోతాయి : హరీశ్ రావు