సిద్దిపేట : పుట్టినవాళ్లు గిట్టక మానరు. మంచిపని చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. చేసిన పనిలో చిరకాలం నిలుస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్న గుండవెల్లి మాజీ ఎంపీపీ మెరుపుల సరస్వతి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో హారీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాడ్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం సరస్వతి, ఆమె కుటుంబం కేసీఆర్‌కు చేదోడు వాదోడుగా పనిచేసిందని గుర్తు చేసుకున్నారు.
ఆమె 23 ఏళ్లు వివిధ పదవుల్లో ప్రజాసేవ చేశారు. ఆనాటి ప్రభుత్వాలు ఎన్నో ప్రలోభాలు, ఒత్తిళ్లు తెచ్చినా లొంగకుండా సరస్వతి, నారా గౌడ్ పనిచేశారని ప్రశంసించారు. వారి కృషిని మర్చిపోలేమన్నారు. సరస్వతి అక్కపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని మాటల్లో చెప్పలేనని ఆయన పేర్కొన్నారు. ఊరికి వెళ్తే చాయ్ తాగకుండా పోనిచ్చేవారు కాదని వారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రోడ్లు ఎప్పుడు వేస్తారని నిలదిసేవారన్నారు. ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.