Mahesh Bigala | గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా Iran, United States మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాల ప్రభావం గల్ఫ్ దేశాలపై పడుతున్నది. ఈ సందర్భంలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ .. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ఏ విధమైన సహాయం అవసరమైనా, గల్ఫ్ దేశాలలో ఉన్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రతినిధులను వెంటనే సంప్రదించాలని సూచించారు. అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ ప్రతినిధులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితులను క్షణక్షణం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల భద్రత మా ప్రాధాన్యత అని, అవసరమైతే అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని మహేష్ బిగాల స్పష్టం చేశారు.
Supritha | అమ్మ సంతోషమే ముఖ్యం .. సురేఖ వాణి రెండో పెళ్లిపై సుప్రీత భావోద్వేగ వ్యాఖ్యలు
Iran vs US | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. దేశం నుంచి 444 విదేశీ విమానాలు రద్దు
Kara release Announcement | ధనుష్ ‘కారా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్ బరిలో దిగుతున్న కరసామి!