MLA Padi Kaushik Reddy | సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్.. దానం నాగేందర్‌పై ఎమ్మెల్యే పాడి ఫైర్
ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పడిపోదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (MLA Padi Kaushik Reddy) అన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు లేదని విమర్శించారు.
హైదరాబాద్: ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పడిపోదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (MLA Padi Kaushik Reddy) అన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు లేదని విమర్శించారు. ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. 2 లక్షల 32 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌పై దానం నాగేందర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శించే స్థాయి దానం నాగేందర్‌కు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనకు సిగ్గుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు.
కాంగ్రెస్ తనకు అన్యాయం చేసిందని అన్నారని, కేసీఆర్ దయతో గెలిచానని దానం నాగేందర్ గతంలో చెప్పారని గుర్తుచేశారు. ప్రజలను వేధించడంలో దానంను మించినోడు లేడని విమర్శించారు. త్వరలోనే దానం ఆక్రమణలు, అక్రమాలు బయటపెడతామన్నారు. బీఆర్ఎస్ నుంచి పోయిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లోకి పోతున్న ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లు ఇస్తున్నారని ప్రశ్నించారు.
LIVE | MLA @KaushikReddyBRS Press Meet at Telangana Bhavan https://t.co/md8b8yKXkm
— BRS Party (@BRSparty) July 14, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

