పదేండ్లు అధికారంలో ఉండి మీరు చేసిందేమిటి?: మంత్రి హరీశ్
మంత్రి హరీశ్| రాష్ట్రంలో తాగునీటితోపాటు సాగునీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే నని మంత్రి హరీశ్ రావు అన్నారు. టీఆర్ఎస్ కంటే ముందు పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు మీరిచ్చింది ఆత్మహత్యలు, ఆకలి చావులు, కాలిపోయిన మోటర్లు అని విమర్శించారు.

సిద్దిపేట: రాష్ట్రంలో తాగునీటితోపాటు సాగునీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే నని మంత్రి హరీశ్ రావు అన్నారు. టీఆర్ఎస్ కంటే ముందు పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు మీరిచ్చింది ఆత్మహత్యలు, ఆకలి చావులు, కాలిపోయిన మోటర్లు అని విమర్శించారు. జిల్లాలోని వర్గల్ మండలం హల్దీ వాగువద్ద గోదావరి జలాలకు మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డితో కలిసి నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం యాసంగి పంటల్లో 53 వేల ఎకరాల్లో వరిసాగు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి జలాలు నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాలు కడుగుతూ పోతుంటే.. ఇది కూడా జరగలేదని అవాస్తవాలు మాట్లాడితే ఎలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘స్వచ్ఛ బడి’ ప్రారంభం
సిద్దిపేటలోని వెల్నెస్ సెంటర్లో నిర్మించిన స్వచ్ఛ బడిని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సిద్దిపేట వెల్నెస్ సెంటర్ దక్షిణ భారతదేశంలోనే రెండోదని చెప్పారు. స్వచ్ఛతపై ప్రతి రోజు ప్రజలకు స్వచ్ఛ బడి ద్వారా అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.

ఘన ద్రవ్యాల నిర్వహణతో పాటు ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం స్వచ్ఛ బడిని నిర్మించారు. ఇందులో చెత్త సేకరణ, చెత్తను తడి, పొడి, హానికరమైన చెత్తగా వేరు చేయడం, చెత్తతో ఇండ్లలోనే ఎరువుల తయారీపై ఈ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మా వ్యాక్సిన్లు సరిగా పని చేయడం లేదు.. అన్నీ కలిపేస్తాం: చైనా
ఇదేం ఇండో-పాక్ యుద్ధం కాదు : సంజయ్ రౌత్
మరోసారి కెమెరాకు చిక్కిన ప్రేమ పక్షులు.. వైరల్‌గా మారిన ఫొటోలు
టీకాలకు వయసు నిబంధన ఎత్తేయాలి: కేజ్రివాల్
చెన్నైపై విజయం.. పృథ్వీ, ధావన్ డ్రెస్సింగ్‌రూమ్ సెలబ్రేషన్స్.. వీడియో
దేశంలో 10 కోట్ల మార్కు దాటిన కొవిడ్ వ్యాక్సినేషన్: కేంద్రం
వివాదాల్లో జో బైడెన్ కుమారుడు
తెరుచుకున్న శబరిమల ఆలయం.. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ప్రత్యేక పూజలు
జానారెడ్డి.. ప్రజలకు గుర్తుండే పని ఒక్కటైనా చేశావా?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

