మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 12:19:37

కేబీఆర్ పార్క్ ఎంట్రీ ప్లాజాను ప్రారంభించిన మంత్రి అల్లోల

కేబీఆర్ పార్క్ ఎంట్రీ ప్లాజాను ప్రారంభించిన మంత్రి అల్లోల

హైదరాబాద్ : ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ  కేబీఆర్ పార్క్ లో మొక్కలు నాటారు. అనంతరం పార్క్ లోని ఎంట్రీ ప్లాజాను ప్రారంభించి మాట్లాడారు. కొవిడ్ -19 ప్రత్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో సందర్శకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక ముందుస్తు జాగ్రత్తల్లో భాగంగా ఎంట్రీ ప్లాజాను ఏర్పాటు చేశామన్నారు. టికెట్ కౌంట‌ర్ వ‌ద్ద భౌతిక దూరం పాటించేలా చ‌ర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

ఎంట్రీ బ్యారియ‌ర్స్ ను మార్చి, కొత్తగా స్వింగ్ బ్యారియ‌ర్స్ ను ఏర్పాటు చేసి ఓపెనింగ్, క్లోజింగ్ ఎంట్రీ వ‌ద్ద  పేషియ‌ల్ డిటెక్షన్ అమ‌ర్చారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం ర్యాంప్ సౌక‌ర్యం క‌ల్పించారు. అర్బన్ ఫారెస్ట్  పార్క్ థీమ్ లాగా ఎంట్రీ ప్లాజా వ‌ద్ద  పీకాక్ బేస్డ్  థీమ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సందర్శకులు, వాకర్స్ భద్రతలో భాగంగా పార్క్ అంతటా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు, మానిటరింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న జంతువులు, పక్షి జాతుల్లో ఎక్కువగా జాతీయ పక్షి నెమలి ఉండటంతో, కేబీఆర్ జాతీయ ఉద్యానవనం ఏర్పాటుకు గుర్తుగా ప్రతీయేటా న‌వంబ‌ర్ 3న అటవీ శాఖ పీకాక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నది పేర్కొన్నారు. 

కేబీఆర్ పార్క్ మూసివేయడంతో సంద‌ర్శకుల పాస్ రెన్యూవ‌ల్ తేదీని సెప్టెంబ‌ర్ వ‌ర‌కు పొడిగిస్తామన్నారు. దీనికి ఎలాంటి అద‌న‌పు రుసుం చెల్లించాల్సిన అవ‌స‌రం లేదని వివరించారు. సంద‌ర్శకులు త‌మ పాసుల‌ను అక్టోబ‌ర్, 2020 నుంచి ఆన్ లైన్ ద్వారా రెన్యువ‌ల్ చేసుకోవ‌చ్చు. హరితహారంలో అందరూ పాల్గొని తప్పనిసరిగా మొక్కలు నాటాలి మంత్రి విజ్ఞప్తి చేశారు.


logo