నల్లగొండ : నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను(BRS party office) కూల్చేయాలన్న హైకోర్టు(High court) ఆదేశం పై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Kancharla Bhupal Reddyd) స్పందించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని చెప్పారు. అలాగే ఇచ్చిన ఆదేశంపై అప్పీల్‌కు వెళ్తున్నాం. అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కూల్చేస్తుంటే చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో ఏ పార్టీ కార్యాలయానికి అనుమతి లేదన్నారు.
కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చడమే పనిగా పెట్టుకుంది. కూల్చడం కాదు నిలబెట్టడం నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతుం న్నారు. ఎన్నిక కుట్రలు చేసిన ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతామన్నారు.