Jammu Kashmir | జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) తొలి దశ పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఇక పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండటంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ 50 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది.
మధ్యాహ్నం 3 గంటల వరకూ 50.65 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించింది. అత్యధికంగా కిస్త్వార్ జిల్లాలో 70.03 శాతం కాగా, అత్యల్పంగా పుల్వామాలో 36.90 శాతం పోలింగ్ నమోదైంది. అనంత్‌నాగ్‌లో 46.67శాతం, దోడాలో 61.90 శాతం, కుల్గాంలో 50.57 శాతం, రాంబన్‌లో 60.04 శాతం, షోపియాన్‌లో 46.84 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
జమ్మూ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ.. తొలి దశలో 24 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏడు జిల్లాల పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 23 లక్షల మంది ఓటర్లు తొలి విడుతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఎన్సీతో కాంగ్రెస్ పొత్తులో ఉంది.
Jammu and Kashmir 1st phase Assembly elections: 50.65% voter turnout recorded till 3 pm in Jammu and Kashmir, as per the Election Commission of India
Anantnag-46.67%
Doda- 61.90%
Kishtwar-70.03%
Kulgam-50.57%
Pulwama-36.90%
Ramban-60.04%
Shopian-46.84% pic.twitter.com/FHVvAvqf9L— ANI (@ANI) September 18, 2024
Also Read..
Jammu Kashmir: జమ్మూకశ్మీర్ పోలింగ్ స్టేషన్లో ఉద్రిక్తత.. కాసేపు పోలింగ్ నిలిపివేత
Neelakurinji flowers | 12 ఏళ్లకోసారి పూసే నీలకురింజినీలు.. తమిళనాడులో కనువిందు.. వీడియో వైరల్