Haryana Polls | హర్యానా అసెంబ్లీకి (Haryana Assembly Polls) వచ్చే నెల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహా కులగణన చేపడతామని హామీ ఇచ్చింది.
‘సాత్ వాదే పక్కే ఇరాదే’ (Saat Vaade, Pakke Irade) పేరుతో ఏడు గ్యారంటీలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. మహిళా సాధికారత కింద 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.2 వేలతో పాటు రూ.500కే గ్యాస్ సిలిండర్లను ఇస్తామని ప్రకటించింది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.6 వేలు పింఛన్ ఇస్తామని తెలిపింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్సను అందిస్తామని హామీ ఇచ్చింది.
క్రిమీలేయర్ను ప్రస్తుతమున్న రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని తెలిపింది. పేదలకు ఒక్కో కుటుంబానికి 100 చదరపు గజాల స్థలం, ఇంటి నిర్మాణం కోసం రూ.3.5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. కుల గణన కూడా నిర్వహిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో వెల్లడించింది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాను, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా తదితరలు పాల్గొన్నారు. కాగా, 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 8వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
#WATCH | Delhi | Congress President Mallikarjun Kharge says, “Every household will be given 300 units of free electricity and free medical treatment of up to Rs 25 lakh… The poor will be given a 100 sq yard plot each and Rs 3.5 lakh as construction cost… We guarantee MSP to… pic.twitter.com/iP4hrzpys6
— ANI (@ANI) September 18, 2024
Also Read..
Karnataka | కర్ణాటకలో పాలస్తీనా అనుకూల బ్యానర్ కలకలం
Arvind Kejriwal | వారం రోజుల్లో అధికార నివాసాన్ని వీడనున్న కేజ్రీవాల్
Udhayanidhi Stalin | రానున్న 24 గంటల్లో డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టనున్న ఉదయనిధి స్టాలిన్..!