Karnataka | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో పాలస్తీనా అనుకూల బ్యానర్ ఏర్పాటు చేయడం కలకలం రేపింది. శివమొగ్గ (Shivamogga) జిల్లాలో మూడు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈద్ పర్వదినం రోజున శివమొగ్గలో పాలస్తీనా అనుకూల బ్యానర్ (We stand with Palestine banner)ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. వెంటనే స్పందించిన కర్ణాటక మాజీ హోంమంత్రి, బీజేపీ నేత అరగ జ్ఞానేంద్ర (Araga Jnanendra) అధికారులకు ఫిర్యాదు చేశారు. బ్యానర్‌ను వెంటనే తొలగించాలని కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. ఈద్ ఊరేగింపు సందర్భంగా ఈ బ్యానర్‌ను ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇది మత సామరస్యానికి భంగం కలిగించే చర్యగా ఆయన అభివర్ణించారు.
దేశ సమైక్యతకు విరుద్ధమైన ఇలాంటి బ్యానర్లు మన సమాజంలో అనైక్యతకు బీజం వేస్తాయన్నారు. గతంలో జరిగిన మంగళూరు కుక్కర్ పేలుడు కేసు, బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనల్లో స్థానికుల ప్రమేయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటికే జరిగిన కొన్ని ఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు. తాజా ఘటన మరింత ఉద్రిక్తతను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేత లేఖపై స్పందించిన పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. బ్యానర్‌ను తొలగించి గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు శివమొగ్గ పోలీసులు వెల్లడించారు.
Also Read..
Arvind Kejriwal | వారం రోజుల్లో అధికార నివాసాన్ని వీడనున్న కేజ్రీవాల్
Udhayanidhi Stalin | రానున్న 24 గంటల్లో డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టనున్న ఉదయనిధి స్టాలిన్..!
Nayanthara | హ్యాపీ బర్త్‌డే మై ఎవ్రీథింగ్.. భర్తతో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన నయనతార