Udhayanidhi Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తనయుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు డిప్యూటీ సీఎం (deputy Chief Minister) పగ్గాలు అప్పగించే సమయం ఆసన్నమైనట్లు తెలిసింది. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశం ఉందని అధికార డీఎంకే వర్గాలు బుధవారం వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు డిప్యూటీ సీఎం (deputy Chief Minister) పగ్గాలు అప్పగిస్తారని గత కొన్నిరోజులుగా అధికార డీఎంకేలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై సీఎం ఎంకే స్టాలిన్ ఇటీవలే స్పందిస్తూ.. ఉదయనిధి డిప్యూటీ సీఎం అయ్యే టైమ్ ఇంకా రాలేదంటూ చెప్పుకొచ్చారు. ‘ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేసే సమయం ఇంకా రాలేదు. తనను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ పార్టీలో పెరుగుతోంది. కానీ, మరీ పూర్తి స్థాయిలో లేదు’ అంటూ సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.
ఇక ఉదయనిధి ప్రస్తుతం తన తండ్రి కేబినెట్లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు, డిప్యూటీ వార్తలను ఉదయనిధి ఇప్పటికే కొట్టి పారేసిన విషయం తెలిసిందే. మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇక 2026లో ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే, ఈ సారి ఉదయనిధికి డిప్యూటీ పగ్గాలు లాంఛనంగా తెలుస్తోంది.
Also Read..
Groundnut Oil | పండుగల వేళ ప్రజలకు భారీ షాక్.. లీటరు పల్లీ నూనె 170!
Revanth Reddy | ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా.. మనకు రావాల్సిన నిధుల కోసమే వెళ్తున్నా..