Nayanthara |లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) పుట్టిన రోజు నేడు ఈ సందర్భంగా నయన్ తన భర్తకు రొమాంటిక్‌గా బర్త్‌డే విషెస్ (Birthday Wishes) తెలియజేసింది. గత రాత్రి డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఈ జంట తమ విలువైన సమయాన్ని గడిపారు. ఇద్దరూ ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ ఫొటోలకు ఫోజులిచ్చారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను నయన్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే మై ఎవ్రీథింగ్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను. నువ్వు కన్న కలలు నిజం కావాలని, ఆ దేవుడు నిన్ను ఎప్పుడూ దీవించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ కపుల్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో 2022 జూన్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. పిల్లలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ (Uyir RudroNeel N Shivan), ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ (Ulag Daiwik N Shivan) అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం ఈ జంట అటు ఫ్యామిలీ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను లీడ్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
Also Read..
CID Shakuntala | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి మృతి
Jr NTR | మనం భాషాపరంగా మాత్రమే విభజించబడ్డాం.. తారక్ కామెంట్స్ వైరల్
UI The Movie | మేకింగ్‌లో హిస్టరీ.. స్టన్నింగ్‌గా ఉపేంద్ర యూఐ లుక్