CID Shakuntala | చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దక్షిణాది అలనాటి నటి సీఐడీ శకుంతల (CID Shakuntala) కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 84. ఛాతి నొప్పితో బాధపడుతున్న ఆమె నిన్న సాయంత్రం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, పలువురు సినీ సెలబ్రిటీలు నటి మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో దాదాపు 600కిపైగా సినిమాల్లో నటించారు. లెజెండరీ నటులు ఎంజీఆర్, శివాజీ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తెలుగులో బుద్దిమంతుడు, నేను మనిషేనే వంటి సినిమాల్లో కనిపించారు. సినిమాల్లోనే కాదు పలు సీరియల్లోనూ ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సీఐడీ ధారావాహికతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆమెను అంతా సీఐడీ శకుంతల (Actress Shakuntala)గానే గుర్తిస్తున్నారు.
Also Read..
Jr NTR | మనం భాషాపరంగా మాత్రమే విభజించబడ్డాం.. తారక్ కామెంట్స్ వైరల్
UI The Movie | మేకింగ్‌లో హిస్టరీ.. స్టన్నింగ్‌గా ఉపేంద్ర యూఐ లుక్
‘డైరెక్టర్ త్రివిక్రమ్నూ ప్రశ్నించండి’