Neelakurinji flowers | నీలకురింజి మొక్కలు (neelakurinji tree).. వీటి గురించి తెలియని వారు ఉండరు. ఈ మొక్కలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణ పూల మొక్కల్లా ఇవి పూలు (Neelakurinji flowers) పూయవు. 12 ఏండ్లకు ఒక్కసారి మాత్రమే పూలు పూస్తాయి. ఈ మొక్కలు జీవితకాలంలో ఒక్కసారే పూతకు వస్తాయి. పూలు విరబూసిన (blooming) తర్వాత మొక్కలు చనిపోతాయి. ఇక ఈ మొక్కలకు పూసే నీలకురింజి పూల (Neelakurinji Flowers) అందాలను వీక్షించేందుకు రెండు కళ్లూ చాలవు.
తాజాగా తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం నీలగిరి (Nilgiri) జిల్లాలోని పిక్కపాటి మందు అనే గిరిజన గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండలపై నీలకురింజి పూలు విరబూశాయి. దీంతో ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన కళ వచ్చింది. కనుచూపు మేర కొండ మొత్తం నీలకురింజి పూలు కనువిందు చేస్తున్నాయి. ఈ పూల అందాలను వీక్షించేందుకు చుట్టుపక్కల నుంచి స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు.
ఈ మొక్కలు పన్నెండేండ్లు పెరిగి పూలు పూసిన తర్వాత చనిపోతాయట. అలా వాటి విత్తనాలతో మొలకెత్తే కొత్త మొక్కలు పూతకు రావడానికి మళ్లీ 12 ఏండ్లు పడుతుందట. ఈ పూలు నీలం రంగులో ఉండటం వల్ల వీటికి నీలకురింజి పుష్పాలు అనే పేరు వచ్చిందట.
#WATCH | Nilgiris, Tamil Nadu: Neelakurinji flowers, which bloom once in 12 years, are blooming near Utagai, the hills adjacent to the Toda tribal village called Pikkapathi Mandu. pic.twitter.com/5vgBp7c7QB
— ANI (@ANI) September 18, 2024
Also Read..
Karnataka | కర్ణాటకలో పాలస్తీనా అనుకూల బ్యానర్ కలకలం
Arvind Kejriwal | వారం రోజుల్లో అధికార నివాసాన్ని వీడనున్న కేజ్రీవాల్
Kamala Harris | ట్రంప్‌నకు కమలా హారిస్ ఫోన్ కాల్