నారాయణపేట : రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. అధికారం అడ్డుపెట్టుకొని అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. వారు చెప్పిన మాట వినకుంటే ప్రాణాలు సైతం తీస్తున్నారు. తాజాగా నారాయణపేట(Narayanapet) జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త (Congress activist) స్థల వివాదంలో(Land dispute) దాడి చేసి గాయపరిచాడు.
ఒకటవ వార్డు ఓం నగర్‌కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త చీలం జనార్ధన్ రెడ్డి స్థల వివాదంలో చీలం రాధమ్మ ఆమె భర్త లక్ష్మా రెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితులు ఊట్కూర్ మండల పోలీస్ స్టేషన్ వెళితే బాధితురాలిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లమని స్థానిక పోలీసులు చెప్పారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి మహబూబ్‌నగర్‌లోని దవాఖానకు తరలించారు. అయితే ఇంత జరిగినా ఇప్పటి వారికి కేసు పోలీసులు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.