హైదరాబాద్ : కెనడాలో(Canada) ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందిన హైదరాబాద్ వాసి ప్రణీత్ కుటుంబాన్ని(Praneet family) ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) పరామ ర్శించారు. ప్రణీత్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి సానుభూతి తెలియజేశారు. కెనడా నుంచి హైదరా బాద్‌కు మృతదేహాన్ని తీసుకురావడానికి తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌తో ఆమె ఫోన్లో మాట్లాడారు.
కాగా, కెనడాలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. హైదరాబాద్ మీర్‌పేటకు చెందిన ప్రణీత్.. కెనడాలో ఎంఎస్ చదువుతున్నాడు. తన అన్న పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి టోరంటోలోని లేక్ క్లియర్‌కు స్విమ్మింగ్‌కు వెళ్లారు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రణీత్ చనిపోయాడు.
కెనడాలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందిన హైదరాబాద్ వాసి ప్రణీత్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ప్రణీత్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి సానుభూతి తెలియజేశారు.
కెనడా నుండి హైదరాబాద్ వరకు మృతదేహాన్ని తీసుకురావడానికి నా వంతు సహాయం అందిస్తానని… https://t.co/EfyGB0SB6Q pic.twitter.com/M04Rna7S4D
— Telugu Scribe (@TeluguScribe) September 18, 2024