అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం (Allaince Government) వందరోజుల పాలన అట్టర్‌ప్లాప్ (Utterplap) అని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి( Kakani Goverdan Reddy ) విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల విజయవాడను ముంచెత్తిన వరదల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.
బాధితులకు (Flood Victims) ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. సుమారు మూడు లక్షల మంది వరద ప్రభావానికి గురికాగా వారికి సహాయ, సహకారాలు అందించలేక పోయారని వెల్లడించారు. చంద్రబాబు నివాసం నీటిలో మునిగిపోవడంతో అక్కడికి వెళ్లలేక కలెక్టరేట్లో ఉండి సమీక్షల పేరిట కాలయాపన చేశారని ఆరోపించారు.
చంద్రబాబు, మంత్రులు వరద ప్రాంతాల్లో పర్యటించినా బాధితులకు ఎలాంటి మేలు జరుగలేదని తెలిపారు. వరద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రకాశం బ్యారేజీలో కొట్టుకువచ్చిన బోట్లు వైసీపీ నాయకులవంటూ తప్పుదోవ పట్టించారని విమర్శించారు. అబద్దాలకు అలవాటు పడ్డ చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు. డీఎస్పీపై తొలి సంతకం పెట్టి వంద రోజులు కావస్తున్న దాని పురోగతి గురించి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.