Karthi 29 | కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీ (Karthi) ఇప్పటికే సత్యం సుందరం, సర్దార్ 2, వా వాతియర్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ సినిమాలు సెట్స్‌పై ఉండగానే కార్తీ మరో కొత్త ప్రాజెక్ట్ Karthi 29ను ప్రకటించాడు. తానక్కరన్ ఫేం తమిళ్(Tamizh) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
కార్తీ ఇప్పటికే ఈ బ్యానర్లో ఖాకీ, సుల్తాన్, కాష్మోరా, జపాన్ సినిమాలను చేశాడు. మళ్లీ ఈ బ్యానర్లో కార్తీ 29 సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్ లుక్‌లో సముద్ర జలాల వెంబడి భారీ షిప్ వెళ్తున్న స్టిల్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతూ వింటేజ్ వైబ్స్‌ను అందిస్తోంది. తాజాగా సినిమా బ్యాక్‌డ్రాప్ గురించి ఆసక్తకర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తమిళనాడులోని రామేశ్వరం బ్యాక్ డ్రాప్లో సాగే స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. కార్తీ నయా ప్రాజెక్ట్‌పై డైరెక్టర్ చేసిన తాజా కామెంట్స్ సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ కథ 1960స్ నేపథ్యంలో ఉండబోతుందని కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో కార్తీని డైరెక్టర్ ఎలా చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. కార్తీ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీకి కొనసాగింపుగా రానున్న ఖైదీ 2లో కూడా నటిస్తు్ండగా.. దీనికి సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది. కార్తీ, అరవింద స్వామి (Aravindha Swamy) తో కలిసి నటిస్తోన్న చిత్రం మెయ్యళగన్ (Meiyazhagan). ‘96’ ఫేం ప్రేమ్ కుమార్.సీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) పేరుతో సెప్టెంబర్ 27న విడుదలవుతోంది.
Jani Master | ఇది లవ్ జిహాద్ కేసు.. జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?
UI The Movie | మేకింగ్‌లో హిస్టరీ.. స్టన్నింగ్‌గా ఉపేంద్ర యూఐ లుక్
Jr NTR | మనం భాషాపరంగా మాత్రమే విభజించబడ్డాం.. తారక్ కామెంట్స్ వైరల్