హైదరాబాద్ : ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని(Asaduddin Owaisi) ముస్లిం సోదరులే పట్టించుకోరు. ఆయన గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు. బీఆర్ఎస్ జాతకాలు మా దగ్గర ఉన్నాయి. అవి చెబితే వాళ్లు తట్టుకోలేరు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్న వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎవరి జాతకాలు ఏంటో ప్రజలే నిర్ణయిస్తారు. మూసీ ప్రాజెక్టును మొదలు పెట్టింది మేమే. మేము చెప్పిన బడ్జెట్లోనే పూర్తి చేసే సత్తా మాకుందని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ప్రేలాపనలు చేసినా మూసీ బాధితుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి పేదలకు న్యాయం చేస్తామన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసదుద్దీన్ ఒవైసీని ముస్లిం సోదరులే పట్టించుకోరు.. ఆయన గురించి మాట్లాడి వేస్ట్.
ఎవరి జాతకాలు ఏంటో ప్రజలే నిర్ణయిస్తారు. మూసీ ప్రాజెక్టును మొదలు పెట్టింది మేమే.. మేము చెప్పిన బడ్జెట్లోనే పూర్తి చేసే సత్తా మాకుంది… https://t.co/TthU1SYKnT pic.twitter.com/iYsAXz81f8
— Telugu Scribe (@TeluguScribe) November 3, 2024