హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అలవికానీ హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ(Congress) సంవత్సర కాలంలోనే హామీలు అమలు చెయ్యలేక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. త్వరలోనే రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉందన్న వ్యాఖ్యల నేపథ్యంలో భట్టి బస్సు యాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, త్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) బస్సు యాత్ర (Bus tour) చేపట్టనున్నారు. డిసెంబర్ లేదా జనవరిలో తెలంగాణలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ బస్సు యాత్ర చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన నేపథ్యంలో.. ఎన్నికలకు ముదు 2023లో చేసిన పాదయాత్రలో తాను పర్యటించిన ప్రదేశాలను సందర్శించనున్నారు. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు అధికారం వచ్చాక పరిష్కారమయ్యాయో లేదో వారిని అడిగి తెలుసుకోనున్నారు.
అయితే ఇదంతా పైకి చూడటానికి బాగానే ఉన్నా బీజేపీఎల్పీ నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్‌పై చేసిన ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ సీఎం బస్సు యాత్ర చేస్తారనే విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది. తెలంగాణలోని 11 మంది మంత్రులు, 75 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ + 8 లోక్‌సభ ఎంపీలు, 37 కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న బీజేపీఎల్పీ నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలపై మౌనం వహించడం పై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో బాంబు పేలుతుందని ఇటీవలే దక్షిణ కొరియా పర్యటనలో జోష్యం చెప్పారు. అయితే ఆ బాంబు భట్టీ రూపంలో పేలుతుందేమోననే గుసగుసలు రాష్ట్ర రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో భట్టి బస్సు యాత్ర హాట్ టాఫిక్‌గా మారింది.
రేవంత్ రెడ్డికి సీఎం పదవి నుండి తొలగిస్తారాన్న వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మౌనం దేనికి సంకేతం
11 మంది మంత్రులు
75 మంది ఎమ్మెల్యేలు
13 మంది ఎమ్మెల్సీలు
3 రాజ్యసభ + 8 లోక్‌సభ ఎంపీలు
37 కార్పొరేషన్ చైర్మన్లు అయినా, సీఎం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుండి తొలగిస్తారన్న… pic.twitter.com/da0CWSl2M3— Telugu Scribe (@TeluguScribe) November 3, 2024