IND vs NZ 3rd Test : సొంతగడ్డపై 12 ఏండ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా మళ్లీ అదే తడబాటు కనబరిచింది. బెంగళూరు, పునే, ముంబై.. వేదిక మారినా ఫలితం మారలేదు. ఇప్పటికే రెండు ఓటములతో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత జట్టు ముంబైలోనూ స్పిన్ అస్త్రానికి కుప్పకూలింది. వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండిన భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 3-0తో వైట్‌వాష్‌కు గురైంది.
స్వల్ప లక్ష్య ఛేదనలో టాపార్డర్ విఫలమైనా రిషభ్ పంత్(64) విధ్వసంక హాఫ్ సెంచరీతో ఆశలు రేపినా.. అజాజ్ పటేల్(6/57) తిప్పేశాడు. వాషింగ్టన్ సుందర్(12)ను బౌల్డ్ చేసి కివీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 25 పరుగుల తేడాతో ఓడి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది.
New Zealand found a way in Mumbai, producing a clean-sweep at Wankhede stadium 🏆https://t.co/Vq9uHVazcz | #INDvNZ pic.twitter.com/DOOf796bva
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2024
వాంఖడేలో 2021లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన అజాజ్ పటేల్ మళ్లీ చెలరేగాడు. తనకు అచ్చొచ్చిన పిచ్ మీద భారత బ్యాటర్లను హడలెత్తించాడు. అనూహ్య టర్న్ లభించడంతో చెలరేగిన అజాజ్ శుభ్‌మన్ గిల్(1) వికెట్‌తో టీమిండియాను ఒత్తిడిలో పడేశాడు. ఆ తర్వాత వరుసగా విరాట్ కోహ్లీ(1), సర్ఫరాజ్ ఖాన్(1)లను పెవిలియన్ పంపి రోహిత్ సేనను ఓటమి అంచుల్లోకి నెట్టాడు.
Ajaz Patel, Mumbai cha raja #INDvNZ pic.twitter.com/G1d0Zi1VkS
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2024
అజాజ్ ధాటికి టాపార్డర్ కుప్పకూలిన వేళ ఓటమి తప్పదా? అనే భయంలో ఉన్న టీమిండియాను రిషభ్ పంత్(64) మరోసారి ఆదుకున్నాడు. 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జట్టుకు ఆపద్భాందవుడిలా మారి.. వీరోచిత అర్ధ శతకం బాదేశాడు. కివీస్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్న పంత్ జట్టును గెలుపు వాకిట నిలిపాడు. పంత్ మెరుపులతో లంచ్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.
పంత్, వాషింగ్టన్ సుందర్(12)లు ఆడిన తీరు చూసి లంచ్ తర్వాత టీమిండియాదే విజయం అనే ధీమాతో ఉన్న అభిమానులకు అజాజ్ పటేల్ షాకిచ్చాడు. రెండు బౌండరీలతో జోరు మీదున్న పంత్‌ను ఔట్ చేసి న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఉత్సాహం నింపాడు. అక్కడితో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత అశ్విన్(8) కాసేపు పట్టుదల ప్రదర్శించినా గ్లెన్ ఫిలిఫ్స్ (3/42)కు దొరికాడు.
That’s a gritty half-century from Rishabh Pant 👌👌
His 14th FIFTY in Test Cricket 👏👏
Scorecard – https://t.co/KNIvTEyxU7#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank | @RishabhPant17 pic.twitter.com/l8xULaauZM
— BCCI (@BCCI) November 3, 2024
వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ చక్కని క్యాచ్ పట్టగా అశ్విన్ డగౌట్ చేరాడు. ఆ వెంటనే ఆకాశ్ దీప్(0)ను బౌల్డ్ చేసిన ఫిలిఫ్స్ హ్యాట్రిక్ మీద నిలిచాడు. కానీ, సిరాజ్(1) ఢిఫెన్స్తో హ్యాట్రిక్ అడ్డుకున్నాడు. ఆ మరుసటి ఓవర్లో అజాజ్ విసిరిన తొలి బంతికి సుందర్ భారీ షాట్ ఆడబోయి బౌల్డ్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్‌కు 121 పరుగుల వద్ద తెరపడింది. అంతే..చెప్పినట్టే రోహిత్ సేనను వైట్ వాష్ చేసిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ భారత గడ్డపై అరుదైన రికార్డు నెలకొల్పాడు.