Udhayanidhi Stalin | బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశాడు తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తమిళం, తెలుగు, కన్నడతో పాటు మలయాళం చిత్ర పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కానీ బాలీవుడ్లో మాత్రం హిందీ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఉత్తరాది ప్రాంతీయ భాషలైన మరాఠీ, బిహారి, భోజపురి, హర్యానా, గుజరాత్ సినిమాలను తొక్కేస్తున్నారని ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాలకు సోంత చిత్రపరిశ్రమనే లేవంటూ స్టాలిన్ తెలిపాడు.
ఈరోజు తమిళ చిత్ర పరిశ్రమతో పాటు సౌత్‌కి చెందిన తెలుగు, మలయాళం, కన్నడ పరిశ్రమలు కోట్లాది వ్యాపారం చేస్తున్నాయి. అయితే ఒక్కసారి మీరే ఆలోచించండి, దక్షిణ భారతదేశంలో లాగా ఉత్తర భారతదేశంలో హిందీ కాకుండా మరే ఇతర భాష అయినా శక్తివంతమైన చిత్ర పరిశ్రమను సృష్టించిందా? ఉత్తర భారత రాష్ట్రాల్లో మాట్లాడే దాదాపు అన్ని భాషలు హిందీకి దూరమయ్యాయి. ఫలితంగా వారి వద్ద హిందీ సినిమాలు మాత్రమే నడుస్తున్నాయి. బాలీవుడ్ హిందీ చిత్రాలను మాత్రమే ఎక్కువగా నిర్మిస్తోందని దానివలన ఉత్తరాదిలోని మిగత పరిశ్రమలు తొక్కేస్తున్నారని అన్నారు. ఉత్తరాదిలోని ఇతర రాష్ట్రాలు వారి పరిశ్రమలను కాపాడుకోవడంలో విఫలమైతే.. హిందీ వారి సంస్కృతిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా వారి గుర్తింపును నాశనం చేస్తుంది అంటూ ఉదయనిధి స్టాలిన్ చెప్పుకోచ్చాడు.