హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ(BJP) పార్టీలు కుమ్మక్కయ్యాయని, బీఆర్ఎస్ను ఎదుర్కొనే ధైర్యంలేక ఆ రెండు పార్టీలు అంతర్గతంగా సహకరించుకుంటూ పచ్చని తెలంగాణలో చిచ్చుపెడుతున్నా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాజాగా బీఆర్ఎస్ చేస్తున్న వాదనలకు మరోసారి బలం చేకూరింది. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) పొద్దున తిట్టి, సాయంత్రం పొగిడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
రేవంత్ రెడ్డి తన విధ్వంసకర పాలనతో తెలంగాణను చీకట్లోకి నెడుతున్నాడు. తెలంగాణ ఉదయించట్లేదు, కాంగ్రెస్ శుష్క వాగ్దానాలనే నీడల చాటున నిలించిందంటూ బండి సంజయ్ ఉదయం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు అంటూ సాయంత్రం మరో స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనపై బండి సంజయ్ ఒకే రోజు రెండు స్టేట్మెంట్లు ఇచ్చి ఆ రెండు పార్టీల మధ్య ఉన్న పెవికాల్ బంధాన్ని మరోసారి గుర్తు చేశారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పిచోళ్లు అని అనుకుంటున్నారా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డిని పొద్దున తిట్టి, సాయంత్రం పొగిడిన బండి సంజయ్
కాంగ్రెస్ పాలనపై ఒకే రోజు రెండు స్టేట్మెంట్లు ఇచ్చిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
రేవంత్ రెడ్డి తన విధ్వంసకర పాలనతో తెలంగాణను చీకట్లోకి నెడుతున్నాడు.. తెలంగాణ ఉదయించట్లేదు, కాంగ్రెస్ శుష్క వాగ్దానాలనే నీడల చాటున… pic.twitter.com/6FBisxDMRQ
— Telugu Scribe (@TeluguScribe) November 3, 2024